A.P.Sports Development Trust

A.P.Sports Development Trust Here we give coaching for the sports youngsters( who are categorised under12-seniors)and also we help poor peoples like orphanges, poor childrens, journalists

కొడిమి జర్నలిస్ట్ కాలనీలో మే 9 నుంచి ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరం10 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు పాల్గొనవచ్చుప్రతిభన...
08/05/2023

కొడిమి జర్నలిస్ట్ కాలనీలో మే 9 నుంచి ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరం

10 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు పాల్గొనవచ్చు

ప్రతిభను గుర్తించేందుకే శిక్షణా శిబిరం

మచ్చా రామలింగారెడ్డి
రాష్ట్ర అధ్యక్షులు
APWJU
చైర్మన్, ఏపీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ (APSDT)

__&______&&&&&&__

ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ APSDT ఆధ్వర్యంలో అనంతపురం రూరల్ మండలంలోని కోడిమి గ్రామంలో కొడిమి జర్నలిస్ట్ కాలనీలో ఈనెల మే 9వ తారీఖు నుంచి జిల్లాలోని యువకులకు వేసవి ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందని మచ్చా రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు APWJU, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ చైర్మన్ ఏపీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ (APSDT) తెలిపారు. జిల్లాలోని ప్రతిభ ఉన్న ఆసక్తి ఉన్న యువ క్రికెటర్లందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతిభ ఉన్న వారిని గుర్తించేందుకు శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని మచ్చా రామలింగారెడ్డి తెలిపారు.10 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలలోపు ఉన్న యువకులందరూ ఈ ఉచిత క్రికెట్ శిక్షణలో పాల్గొనవచ్చునని అందరూ ఉపయోగించుకోవాలని మచ్చా రామలింగారెడ్డి కోరారు.రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా అనంతపురం జిల్లాలో కొడిమి జర్నలిస్టు కాలనీలో ఉచితంగా క్రికెట్ శిక్షణ శిబిరం నిర్వహించడం ఒక్క రూపాయి కూడా డబ్బు తీసుకోకుండా ఉచితంగా క్రికెట్ నేర్పించడం జరుగుతుందని రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇటువంటి ఉచిత క్రికెట్ శిక్షణ లేదని మచ్చా రామలింగారెడ్డి అన్నారు.ఎక్కడ క్రికెట్ శిక్షణ జరిగిన డబ్బులు వసూలు చేస్తారని అటువంటిది కొడిమిలో ఉచితంగా క్రికెట్ శిక్షణ ఇస్తున్నామని అన్నారు క్రికెట్ అంటే వ్యాపారంగా మారి పేదవాడికి అందుబాటులో లేకుండా అయినటువంటి ఈ పరిస్థితుల్లో ఉచితంగా నేర్పించాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నామని మచ్చా అన్నారుక్రికెట్ కు అవసరమైన క్రికెట్ సామాగ్రి క్రీడాకారులకు ఏపీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఉచితంగా ఇస్తుందని మచ్చా రామలింగారెడ్డి తెలిపారుక్రికెట్ నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న యువకులు ఈనెల 8వ తారీకు ఐదు గంటలకు సాయంత్రంలోపు కొడిమి జర్నలిస్టు కాలనీలో క్రికెట్ అకాడమీలో నేరుగా వారి పేర్లను నమోదు చేసుకోవచ్చని ఆధార్ కార్డు ఉంటే చాలని మచ్చా తెలిపారు.ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరం అనంతరం క్రికెటర్లకు సర్టిఫికెట్లు ప్రధానం చేయడం జరుగుతుందని మచ్చా రామలింగారెడ్డి అన్నారు సీనియర్ క్రికెటర్లతో క్రికెట్ శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తామని శిక్షణను ఇవ్వడానికి సీనియర్ క్రికెటర్లను ఎంపిక చేయడం జరిగిందని మచ్చా రామలింగారెడ్డి వివరించారు. కె.విజయరాజు
జిల్లా కార్యదర్శి కి కొడిమి జర్నలిస్ట్ కాలనీలో అప్లికేషన్లు ఇవ్వాలి.
సెల్ నెంబర్
9490062555
7702940710
ఇతర వివరాలకు సంప్రదించవచ్చునని
అందజేయాలని మచ్చా రామలింగారెడ్డి తెలిపారు
______________________

Good evening all
15/12/2022

Good evening all

27/11/2022
*మచ్చా  దత్తారెడ్డి అద్భుత సెంచరీ* *మణిపూర్ జట్టుపై 105 పరుగులు నాటౌట్* *మచ్చా దత్త రెడ్డిరెండవ సెంచరీ*  *మణిపూర్ పై ఆంధ...
27/11/2022

*మచ్చా దత్తారెడ్డి అద్భుత సెంచరీ*

*మణిపూర్ జట్టుపై 105 పరుగులు నాటౌట్
*
*మచ్చా దత్త రెడ్డిరెండవ సెంచరీ*

*మణిపూర్ పై ఆంధ్ర అద్భుత ప్రదర్శన*
________________________

భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు బీసీసీఐ ఆధ్వర్యంలో ఈరోజు 27వ తారీఖున ఆదివారం గుంటూరు జిల్లా మంగళగిరిలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నందు ఆంధ్ర క్రికెట్అసోసియేషన్ మైదానంలో ఆంధ్ర మణిపూర్ జట్ల మధ్య మధ్య అండర్ 19 కూచ్ బిహారి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది రెండవరోజు ఆంధ్ర మణిపూర్ జట్లు మధ్య జరిగిన పోటీలో టాస్ గెలిచి మణిపూర్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది ఎంచుకున్నది గుంటూరు జిల్లా మంగళగిరిలో జరుగుతున్న అండర్ 19 కూచ్ బిహారి క్రికెట్ టోర్నమెంట్లో ఆంధ్ర జట్టు మొదటిరోజు 461 పరుగులు చేసి 8 కోల్పోయి మ్యాచ్ డిక్లేర్ చేశారు114 ఓవర్లలో ఆంధ్ర జట్టు మొదటి ఇన్నింగ్ ముగిసింది ఆంధ్ర జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ మచ్చా దత్త రెడ్డి అద్భుత బ్యాటింగ్ చేసి జట్టును ఆదుకున్నారు ఆంధ్ర జట్టు వైస్ కెప్టెన్ మచ్చా దత్త రెడ్డి ఇంతకుముందే హర్యానా జట్టుపై అద్భుత సెంచరీ తో ఆంధ్ర జట్టుని విజయపతంలో నడిపించిన విషయం తెలిసిందే అద్భుత ఫామ్ లో ఉన్నటువంటి దత్తారెడ్డి వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ అద్భుతంగాఈరోజు కూడా మణిపూర్ జట్టుపై చెలరేగి ఆడారు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా బ్యాటింగ్ వచ్చిన మచ్చ దత్తారెడ్డి చూడముచ్చటైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నారుమచ్చ దత్త రెడ్డి అద్భుతమైన బ్యాటింగ్ ప్రతిభతో ఆంధ్ర జట్టును ఆదుకున్నారు మచ్చా దత్త రెడ్డి అద్భుతమైన బ్యాటింగ్ ప్రతిభతో గ్రౌండ్ నలుమూలన ఫోర్లు సిక్సర్ల వర్షం కురిపించారు మచ్చా దత్త రెడ్డి కేవలం 100బంతుల్లో 105 పరుగులు సాధించి నాటౌట్ గా నిలిచారు అందులో 7ఫోర్లు 5 సిక్సర్లు ఉన్నాయి ప్రముఖ ఉద్యమ నాయకుడు మచ్చా రామలింగారెడ్డి కుమారుడే మచ్చా దత్త రెడ్డి దత్త రెడ్డి గ్రౌండ్ నలుమూలల అద్భుతమైన బ్యాటింగ్తో పరుగుల వరద సృష్టించారు మచ్చ దత్తారెడ్డి ఇప్పటివరకు జరిగిన నాలుగు మ్యాచ్ల్లో 400కు పైగా పరుగులు సాధించి అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు ఇందులో రెండు సెంచరీలు సాధించారు రెండు మ్యాచ్లు నాటౌట్ గా ఉన్నారు తర్వాత బ్యాటింగ్ చేసిన మణిపూర్ జట్టు రెండవ రోజు రోజు ఆట ముగిసే సమయానికి 134 పరుగులకు ఎనిమిది వికెట్లు కోల్పోయింది రేపు మూడో రోజు రేపు మణిపూర్ జట్టు బ్యాటింగ్ చేస్తుంది కూచ్ బిహారీ అండర్ 19 క్రికెట్ పోటీలు డిసెంబర్ నెల రెండవ వారం వరకు దేశంలో వివిధ రాష్ట్రాల్లో పోటీలు జరుగుతాయి ఈ పోటీలలో ప్రతిభ చూపిన వారిని భారత అండర్ 19 జట్టుకు ఎంపిక చేస్తారుప్రముఖ ఉద్యమ నాయకుడు మచ్చా రామలింగారెడ్డి కుమారుడే మచ్చా దత్త రెడ్డి

===================

Datta MkMk Datta Reddy Scored : 105 Sixes: 5Fours: 7Balls faced : 94 balls Innings Declared at 114.1 overs Wickets remai...
27/11/2022

Datta Mk
Mk Datta Reddy
Scored : 105
Sixes: 5
Fours: 7
Balls faced : 94 balls
Innings Declared at 114.1 overs
Wickets remains: 2
Strike rate: 112.

Team andhra won against odissa, MK DATTA REDDY Scored 45runs and taken 4 catches and 3 stumpings
22/11/2022

Team andhra won against odissa, MK DATTA REDDY Scored 45runs and taken 4 catches and 3 stumpings

Here are the list of supporting staff of u16 state (vijay merchant trophy) tournament
21/11/2022

Here are the list of supporting staff of u16 state (vijay merchant trophy) tournament

*కొడిమి జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధికి సహకారం అందిస్తా**రోడ్డు పనులకు భూమి పూజ 1కోటి 10లక్షల  నిధులు విడుదల**జర్నలిస్ట్ కా...
10/08/2022

*కొడిమి జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధికి సహకారం అందిస్తా*

*రోడ్డు పనులకు భూమి పూజ 1కోటి 10లక్షల నిధులు విడుదల*

*జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధికి మచ్చా రామలింగారెడ్డి కృషి అభినందనీయం*

*రెండు నెలల్లో పనులు పూర్తి చేస్తాం*

*భాగ్యరాజ్ ఎస్సీ పంచాయతీరాజ్ శాఖ*

===================

👉రాష్ట్రంలో మొట్టమొదటి జర్నలిస్ట్ కాలనీ కొడిమి జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధికి అన్ని విధాలా సహకారం అందిస్తామని భాగ్యరాజ్ ఎస్సీ పంచాయతీరాజ్ శాఖ అన్నారు.

👉ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ APJDS ఆధ్వర్యంలో బుధవారం ఉదయం కొడిమి జర్నలిస్ట్ కాలనీ నందు రాచానపల్లి నుంచి నేరుగా జర్నలిస్ట్ కాలనీకి తారు రోడ్డు, సిమెంటు రోడ్డు పనులకు భాగ్యరాజ్ పంచాయతీరాజ్ శాఖ ఎస్సీ, మచ్చా రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు APWJU ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, శ్రీధర్ మూర్తి ఎమ్మార్వో, పంచాయతీరాజ్ శాఖ డీఈ రసూల్, శ్రీనివాస్ రెడ్డి, విజయరాజు, వెంకటేశ్వర్లు, కొడిమి పంచాయతీ సెక్రెటరీ రామకృష్ణ భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.

👉ఈ సందర్భంగా భాగ్యరాజ్ పంచాయతీరాజ్ ఎస్సీ మాట్లాడుతూ కొడిమి జర్నలిస్ట్ కాలనీకి 1 కోటి 10 లక్షల రూపాయలను పంచాయతీరాజ్ శాఖ నిధులు విడుదల చేసిందని అన్నారు.

👉కొడిమి జర్నలిస్ట్ కాలనీలో సిమెంట్ రోడ్లు, రాచానపల్లి నుంచి జర్నలిస్టు కాలనీకి తారు రోడ్డుని మంజూరు చేయడం జరిగిందని రెండు నెలలలోపు కొడిమి జర్నలిస్ట్ కాలనీలో అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని భాగ్యరాజ్ అన్నారు.

👉నేను రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో పనిచేశానని జర్నలిస్టులకు ఇంత మంచి కాలనీ ఎక్కడా లేదని అంటూ.. ఈ కాలనీ అభివృద్ధికి మచ్చా రామలింగారెడ్డి ఎన్నో సంవత్సరాలుగా కృషి చేస్తున్నారని నాకు కూడా అనేక సార్లు ఫోన్ చేసి ఈ కాలనీ అభివృద్ధి కోసం నిత్యం కోరుతూ ఉండేవాడని గుర్తు చేశారు ఆయన కృషిని అభినందిస్తున్నానని భాగ్యరాజ్ అన్నారు.

👉కమ్యూనిటీ హాల్ కూడా మీ నాయకుడు అడిగారని అది కూడా తొందరలో జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి ఏదో ఒక నిధులు ద్వారా కమ్యూనిటీ హాల్ కూడా త్వరలోనే నిర్మిస్తామని జర్నలిస్టులకు భాగ్యరాజ్ ఎస్సీ హామీ ఇచ్చారు.

👉 మచ్చా రామలింగారెడ్డి మాట్లాడుతూ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి శాసనసభ్యులు రాప్తాడు, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, కోన శశిధర్ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్, కొడిమి జర్నలిస్టు కాలనీకి ఒక కోటి పది లక్షల రూపాయలను మంజూరు చేసినందుకు వర్కింగ్ జర్నలిస్టులు తరపున వారికి అభినందనలు తెలుపుతున్నామని అన్నారు.

👉రాబోవు రోజుల్లో కొడిమి జర్నలిస్టు కాలనీలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే ఇతర ప్రజా ప్రతినిధులు అధికారుల సహకారంతో ముందుకుపోతామని మచ్చా రామలింగారెడ్డి అన్నారు.

👉కొడిమి జర్నలిస్టు కాలనీలో పట్టాలు ఉన్నటువంటి జర్నలిస్టు మిత్రులందరికీ వెంటనే ఇళ్ల నిర్మాణం చేపట్టాలని మచ్చా అన్నారు.

👉భూమి పూజ అనంతరం భాగ్యరాజ్ పంచాయతీరాజ్ ఎస్సీ కొడిమి జర్నలిస్ట్ కాలనీలోని క్రికెట్ అకాడమీలో కొద్దిసేపు క్రికెట్ ఆడి జర్నలిస్టులను ఉత్సాహపరిచారు భూమి పూజ అనంతరం పంచాయతీరాజ్ ఎస్సీ భాగ్యరాజ్, డిఇ రసూల్ శ్రీనివాస్ రెడ్డి ఇతర అధికారులను జర్నలిస్టు డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు

👉 ఈ కార్యక్రమంలో
కొడిమి సర్పంచ్ సుబ్బిరెడ్డి, వైయస్సార్సీపి మండల కన్వీనర్ పవన్, విఆర్వో రమేష్, సచివాలయం ఇంజినీరింగ్ అసిస్టెంట్ రాజేంద్ర, రాజారాం హనుమంత్ రెడ్డి మల్లికార్జున, ప్రసాద్, చలపతి, జానీ, దాదు, ఉపేంద్ర, దామోదర్, ప్రకాష్, రంగనాథ్, శ్రీకాంత్, సాయి, తేజ, శేఖర్, అమరేశ్వర్ ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రింటు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు.

=================
*ANDHRA PRADESH JOURNALIST DEVELOPMENT SOCIETY (APJDS)*

07/08/2022

Address

Ashoknagar
Anantapuramu
515001

Website

Alerts

Be the first to know and let us send you an email when A.P.Sports Development Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category