12/04/2024
Be Aware
Horizon Solutions is a 15 yrs experienced IT based organization
12/04/2024
Be Aware
Openings for HR Exe,
WebDesigner
PHP Developer
12/02/2020
Virtual Repair
A tweet by veteran cyber expert Pukhraj Singh that the 'hackers' attacked the communications system of the Kudankulam Nuclear Power Board has created a nationwide sensation. Lieutenant General Rajesh Pant, National Cyber Security Coordinator, noted that the cyber attack had already taken place in September. On October 29, the Kudankulam authorities announced that the news was spreading on social media and that there was nothing like it. Detrock has revealed that the computer system of the General Administration Division of the Nuclear Center is infected with 'malware'. The technology department at the center said it was safe to use computers connected to unsecured internet systems (airgap).
The attack highlights the cyber security flaws in India's most important security systems. North Korea-based hacking gangs are increasingly using 'Detrock malware'. These gangs are stealing information and planning more cyber attacks. This "malware" is used by hackers to steal key information from South Korea's financial services, banking and defense sectors. SA Bhardwaj, former chairman of India's Baba Nuclear Research Center (BARK), said he received e-mails from hackers. Such e-mails have been reported. He is also the technical director of the Indian Atomic Power Company and a Thorium-based 'AHWR reactor' scientist! North Korea has for some time been interested in 'thorium-based nuclear technology' from 'uranium-based nuclear technology'. It is targeting India, which is strong in thorium-based nuclear technology. Scientists from other countries who are doing research on thorium technology are also looking into it. Anil Kakodkar, another key scientist from India, also received similar e-mails.
మహిళల పై సైబర్ నేరాలు ఇలా !
బెంగళూరుకు చెందిన ఓ నవజంట హనీమూన్‌కి వెళ్లారు. తమ ఏకాంత దృశ్యాలను ఫోన్లో చిత్రీకరించుకున్నారు. ఫోన్ పాడవటంతో మరమ్మతు కోసం సెల్‌ఫోన్ మెకానిక్‌కు ఇచ్చారు. ఆ వీడియోలు తన దగ్గర దాచిపెట్టుకున్న ఆ మెకానిక్.. డబ్బులివ్వకపోతే వాటిని పోర్న్‌సైట్లలో పెడతానని బెదిరించేవాడు. ప్రతిసారీ అతనికి డబ్బులివ్వలేక, ఆ వీడియోలు బయటకొస్తే పరువు పోతుందన్న వేదనతో ఆ జంట ఆత్మహత్యకు పాల్పడింది.
కొత్త ఫోనా? చూస్తానివ్వు అంటూ ఓ అమ్మాయి ఫోన్‌ను తీసుకున్న స్నేహితుడు అందులో స్పైయాప్ ఇన్‌స్టాల్ చేశాడు. ఆ అమ్మాయి ఫోన్లో మాట్లాడే ప్రతి సంభాషణ, ఏకాంత దృశ్యాలు తన ఫోన్ నుంచే పర్యవేక్షించేవాడు. తన వాంఛ తీర్చకపోతే ఆ దృశ్యాలను అంతర్జాలంలో పెడతానని బెదిరింపులకు దిగాడు.
మహిళలే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు ఎలా రెచ్చిపోతున్నారో చెప్పేందుకు ఇవి తార్కాణాలు మాత్రమే. ‘‘మహిళలపై సైబర్ నేరాలు-తీసుకోవలసిన చర్యలు’’ అంశంపై మహిళా కమిషన్ ఆధ్వర్యంలో గురువారం విజయవాడలో జరిగిన సదస్సులో సైబర్ నేరాలపట్ల ఎలా అప్రమత్తంగా ఉండాలో నిపుణులు వివరించారు.
జాగర్తలు ఇలా....
అపరిచితుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను అనుమతించొద్దు.
మీ ఫొటోలేవీ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయొద్దు.
అసభ్యసందేశాలు పంపిస్తున్న వారి నంబర్లు బ్లాక్ చేయాలి.
మీ ఫోన్ ఇతరులకు ఇవ్వద్దు
వివాహ పరిచయ వేదిక (మ్యాట్రీమోనీ) సైట్లలో ఉన్న ప్రొఫైల్స్‌ను గుడ్డిగా నమ్మి ఫొటోలు, వివరాలు పంపొద్దు
మన ఫోన్లకు సందేశాల రూపంలో వచ్చే లింక్‌లపై క్లిక్ చేస్తే ర్యాట్‌లు, స్పైవేర్లను ఫోన్‌లోకి అనుమతించినట్లే. తర్వాత ఫోన్లు హ్యాక్ చేసి.. మహిళల ఫొటోలు దొంగిలించి కాల్‌గర్ల్స్ వెబ్‌సైట్‌లో పెడుతున్నారు.
వాట్సాప్ వినియోగదారులు కొందరిని లక్ష్యంగా చేసుకుని స్పైవేర్ దాడి జరిగిందని వాట్సాప్ సంస్థ నిర్ధారించటంతో భారతదేశంతో సహా చాలా దేశాల్లో ఆగ్రహం, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
భారతదేశంలో కొంతమంది ఈ హ్యాకింగ్ వెనుక ప్రభుత్వ హస్తం ఉందని ఆరోపిస్తూ వేలెత్తి చూపుతున్నారు. పెగాసస్ స్పైవేర్‌ను సృష్టించిందన్న ఆరోపణలున్న ఎన్ఎస్ఓ గ్రూప్ ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్న వార్తలు రావడమే అందుకు కారణం.
ఈ ఆరోపణలతో ఆ సంస్థ మీద వాట్సాప్ కేసు వేసింది. ఆ ఆరోపణలను ఎన్ఎస్ఓ గట్టిగా తిరస్కరించింది. భారత ప్రభుత్వం కూడా తన ప్రమేయం లేదంటూ ఆరోపణలను కొట్టివేసింది.
ఈ పరిస్థితుల్లో కొందరు యూజర్లు వాట్సాప్‌కు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు. సిగ్నల్, టెలిగ్రామ్ వంటి యాప్‌ల వైపు చూస్తున్నారు. వాటిలో మరింత సురక్షితమైన ఎన్‌స్క్రిప్షన్ ఉందని చెప్తున్నారు.
ఏంటీ పెగాసస్? ఎలా పనిచేస్తుంది?
పెగాసస్ అనేది ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఓ అనే సంస్థ తయారు చేసిన ఒక స్పైవేర్ టూల్. ఇలాంటి సాఫ్ట్‌వేర్‌లు తయారు చేయడానికి ఆ సంస్థ పెట్టింది పేరు. వ్యక్తుల మీద నిఘా పెట్టడమే పెగాసస్ ముఖ్య ఉద్దేశం. దీనికోసం అది యూజర్లకు ఒక లింక్ పంపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే చాలు, ఆ యూజర్ ఫోన్ పూర్తిగా ఎటాకర్ అధీనంలోకి వెళ్లిపోతుంది.
యూజర్‌కు తెలీకుండానే ఆ టూల్ అతడి ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయిపోతుంది. ఒకసారి ఇన్‌స్టాల్ అయ్యాక ఫోన్‌కు సంబంధించిన డేటానంతా ఎటాకర్‌కు పంపించడం మొదలుపెడుతుంది. వ్యక్తిగత డేటాతో పాటు పాస్‌వర్డ్స్, కాంటాక్ట్ లిస్ట్, క్యాలెండర్ ఈవెంట్స్, ఈమెయిల్స్‌తో పాటు లైవ్ వాయిస్ కాల్స్‌ను కూడా ఇది ట్రాక్ చేయగలదు.
ఆఖరికి యూజర్‌కు తెలీకుండా అతడి ఫోన్ కెమెరాను, మైక్రోఫోన్‌ను కూడా ఎటాకర్ ఆన్ చేయగలడు. ఈ పెగాసస్ టూల్ లేటెస్ట్ వెర్షన్‌లో యూజర్ అసలు ఎలాంటి లింక్‌పైన క్లిక్ చేయకపోయినా సరే, కేవలం ఒక మిస్డ్ వీడియో కాల్ ఇచ్చి కూడా అతడి ఫోన్‌ను హ్యాక్ చేయొచ్చని వాట్సాప్ ఆరోపిస్తోంది.
These apps are removed by Google in Google Play store.
For your information, If you have the same apps in your mobile remove it.
These apps are having "Android.Click.312.origin" Trojan which will collect your data.
1 GPS Fix
2 Webcams
3 Bombuj
4 Social Studies (a Russian app)
5 1300 Math Formulas Mega Pack
6 Sikh World - Nitnem & Live Gurbani Radio
7 OK Google Voice Commands (Guide)
8 Ramadan Times: Azan, Prayer Times & Qibla
9 Prayer Times: Azan, Quran, Qibla Compass
10. Al Quran Mp3 - 50 Reciters & Translation Audio
11. Full Quran MP3 - 50+ Audio Translation & Languages
12. Qibla Compass - Prayer Times, Quran, Kalma, Azan
13. Muslim Prayer Times & Qibla Compass
14. GPS Route Finder
15. Ixigo Train
16. Who deleted me?
17. Who unfriended me?
18. Notepad - Text Editor PRO
19. Notepad - Text Editor PRO (different APK)
20. Power VPN Free VPN for Android
21. Video to MP3 Converter, RINGTONE Maker, MP3 Cutter
22. Remove Unwanted Object
23. GPS Speedometer PRO
24. GPS Speedometer
25. PDF Viewer
26. Route Finder
27. Pedometer Step Counter
28. EMI Calculator - Loan & Finance Planner
29. English Urdu Dictionary
30. Cricket Mazza Live Line
31. ai.type keyboard Plus + Emoji
32. QR Code Reader
33. QR & Barcode Scanner
------------------------------------Horizon Solutions--------
29/06/2019
Beware of SILEX Malware
వణికిస్తున్న సైలెక్స్ మాల్‌వేర్
స్మార్ట్‌ఫోన్లు, మోడెమ్‌లు, స్మార్ట్‌టీవీలకు ముప్పు
ప్రపంచవ్యాప్తంగా చెడిపోతున్న ఐఓటీ ఉపకరణాలు
మనమేం చేయాలి?
* ప్రపంచంలో వినియోగిస్తున్న ఉపకరణాల్లో 15 శాతం పరికరాలకు డీఫాల్ట్ పాస్‌వర్డులు, సులువుగా ఊహించే 12345 తరహా పాస్‌వర్డులు పెడుతున్నారని సర్వేలు చెబుతున్నాయి.
* ఇలాంటి ఉపకరణాలే లక్ష్యంగా ప్రస్తుతం సైలెక్స్ పని చేస్తోంది.
* డీఫాల్ట్ పాస్‌వర్డులు లేనివాటిపై దీని ప్రభావం తక్కువ.
* వెంటనే పాస్‌వర్డులు మార్చుకోవాలి.
* ఒకవేళ ఇప్పటికే మీ స్మార్ట్‌ఫోన్-టీవీ, మోడెమ్‌లు పని చేయకపోతే వాటిని పనికిరానివని పాడేయనక్కర్లేదు. కొత్తవి కొనక్కర్లేదు. సంబంధిత కంపెనీకి చెందిన ఒరిజినల్ సాఫ్ట్‌వేర్ కోసం ఆ ఉపకరణంపై ఉన్న వివరాలు పరిశీలించి, సంప్రదించండి.
మొబైల్‌లో హఠాత్తుగా ఓ పాప్‌అప్ ఈ మెయిల్ బాక్స్ డిస్‌ప్లే అవుతుంది. సహజంగా దానిపై క్లిక్ చేస్తాం. అందులోని లింక్ ద్వారా సంబంధిత వెబ్‌సైట్లోకి వెళ్తాం. తెలియక వారు అడిగిన వివరాలను చాలా మంది నింపేస్తుంటారు. ఫలితంగా మన బ్యాంకు ఖాతాకో, వ్యక్తిగత సమాచారానికో గండి పడటం ఖాయం. ఇలాంటి కేసులు నిత్యం ఎన్నో చూస్తుంటాం. దీనిపై అమెరికాకు చెందిన ‘వాలిమెయిల్’ అనే సంస్థ పరిశోధన చేపట్టింది. దాదాపు 20 లక్షల మంది ఖాతాలను పరిశీలించింది. దీనికి సంబంధించిన వివరాలను ఆ సంస్థ సీఈవో అలెగ్జాండర్ గ్రేసియా తోబార్ వెల్లడించారు.
ప్రపంచ వ్యాపంగా రోజుకు సగటున 300కోట్ల నకిలీ ఈ మెయిల్‌లు బట్వాడా అవుతున్నాయని వాలిమెయిల్ పరిశోధనల్లో తేలింది. వీటిలో చాలా వరకు అనుమానాస్పద మెయిల్స్ ఉండటం, ఫిషింగ్, స్ఫూఫింగ్ ద్వారా వినియోగదారుల సమాచారాన్ని దొంగలించేవే కావడం గమనార్హం. పలు సంస్థల్లో సైబర్ సెక్యూరిటీ ప్రమాణాలను సరిగ్గా పాటించకపోవడం వల్ల ఆయా సంస్థల పేర్లతో హ్యాకర్లు మెయిల్స్ పంపిస్తున్నారని వాలిమెయిల్ వెల్లడించింది.
అయితే ఇది అంతగా భయపడ్డ దగ్గ విషయమేమీ కాదని, నకిలీ ఈ మెయిల్స్‌పై యుద్ధం చేసేందుకు అన్ని కంపెనీలు ముందుకు వస్తున్నాయని అలెగ్జాండర్ గ్రేసియా తెలిపారు. ఇలాంటి మెయిల్స్ రాకుండా సాధారణ రక్షణ పద్దతి ద్వారా అడ్డుకోవడం అంతసులువేం కాదన్నారు. దీనికోసం డొమైన్ బేస్‌డ్ మెస్సేజ్ అథెంటికేషన్ రిపోర్టింగ్ అండ్ కన్ఫర్‌మేషన్ (డీఎంఏఆర్‌సీ), సెండర్ పాలసీ ఫ్రేమ్ వర్క్ (ఎస్‌పీఎస్), డొమైన్ కీస్ ఐడెంటిఫైడ్ మెయిల్ (డీకేఐఎం) తదితర నూతన టెక్నాలజీలను ఉపయోగించాలని వాలిమెయిల్ స్పష్టం చేసింది. వీటిని ఉపయోగించడం వల్ల దాదాపు 80 శాతం వరకు నకిలీ ఈమెయిల్స్ రాకుండా నిరోధించవచ్చని తమ పరిశోధనలో తేలినట్లు వెల్లడించింది. డీఎంఏఆర్‌సీ టెక్నాలజీ ఉన్న డొమైన్లను ప్రస్తుతం ఎక్కువగా అమెరికాలోనే ఉపయోగస్తున్నట్లు అలెగ్జాండర్ గ్రేసియా తెలిపారు.