RaituNestham

Call Directions Website Contact the business

RaituNestham Raitu Nestham, a friend of Farmers working for development of farming society. Intoduces innovative farming ideas through digital platforms.

Conducts training classes on organic / natural farming /Terrace gardening/ Millets promotion in AP & TS states.

** ఔషధ మొక్క… ఇరుగుడు చెట్టు ** --------------------------------------ఇరుగుడు చెట్టు ఒక మధ్యమ పరిమాణం నుండి పెద్ద పరిమాణ...
30/10/2026

** ఔషధ మొక్క… ఇరుగుడు చెట్టు **
--------------------------------------
ఇరుగుడు చెట్టు ఒక మధ్యమ పరిమాణం నుండి పెద్ద పరిమాణంలో ఉండే ఒక ఆకులు రాల్చే చెట్టు. ఇది 30 మీ. ఎత్తు పెరుగుతుంది. చెట్టు క్యానపి విస్తృతంగా వ్యాపించి, పలుచగా ఉంటుంది. బెరడు పలుచగా, బూడిద రంగులో, నిలువైన సాళ్ళు కలిగి ఉంటాయి. పొడవాటి ప్రధాన వేరు కలిగి ఉంటుంది. ఆకులలో 3-5 చిన్న ఆకులు కలిగి ఉంటాయి. ఇవి ఒక దాని తర్వాత ఒకటిగా ఏర్పడతాయి. 2.5-3.6 సెం.మీ. వ్యాసం కలిగి వెడల్పాటి అండాకారంలో ఉంటాయి. పూలు 5-8 మి.మీ. పొడవు, తెల్లబారిన తెలుపు నుండి పాలిపోయిన పసుపు పచ్చ రంగులో ఉంటాయి. కాయలు 5-7 సెం.మీ. x 8-13 మి.మీ. పరిమాణంలో 14 గింజలు కలిగి ఉంటుంది. గింజలు 6-8 x 4-5 మి.మీ. పరిమాణంలో కిడ్నీ ఆకారంలో లేతగోధుమ రంగులో ఉంటాయి..

సాధారణ నామం : షిషం/ఇండియన్‌రోజ్‌వుడ్ శాస్త్రీయ నామం : డాల్బెర్ౙియాసిస్సూ కుటుంబం: ఫాబేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

ఇరుగుడు చెట్టు అనేక భాగాలను సంప్రదాయకంగా అనేక వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు.
బెరడు, కొయ్య చేదు, వేడి, వగరుగా ఉండి లైంగికంగా ఉత్తేజితం, గర్భస్రావం, కఫహరం, కడుపులో ఏలిక పురుగుల నాశకం, జ్వరం తగ్గించే …క్షణాలు కలిగి ఉంటాయి. రక్తం ద్వారా సంక్రమించే వ్యాధులు, ల్యుకేమియా, డిసెంట్రిల నివారణలో ఉపయోగిస్తారు.
గనోరియా తీవ్ర దశలో ఉన్నప్పుడు ఆకుల కషాయాన్నిస్తారు. మూత్రంలో చీముని తొలగించడానికి, స్త్రీల బహిష్టు సమయంలో రక్త స్రావాన్ని తగ్గించడానికి ఉపయోగిస్తారు. శరీరంపై బొబ్బలు, మొటిమలను నయం చేయడానికి కూడా ఉపయోగిస్తారు.
కొయ్యపేస్టుని పుండు దురదని, కురుపుల్ని, వాంతులు తగ్గించడానికి ఉపయోగిస్తారు.
ప్రజావైద్యంలో దీనిని ఉత్తేజితంగా, మందుగా ఉపయోగిస్తారు. గనోరియాకు, చర్మ వ్యాధులకు మంచి మందు.
ఆయుర్వేదంలో కంటి జబ్బులను నయం చేయడానికి దీనినుపయోగిస్తారు.
వ్యవసాయరంగంలో

ఆకులు, లేతకాడలు, పచ్చి కాయలను పశువులకు మంచి మేతగా వేస్తారు.
ఇరుగుడు చెట్టు అనేక వాతావరణ, అటవీ వ్యవసాయ ప్రయోజనాలను కల్గిస్తుంది.
దీనిని గాలి నిరోధకంగా, షెల్టర్ బెల్ట్‌గా, మామిడి, టీ, కాఫీ తోటలలో అంతర పంటగా నీడనిచ్చే చెట్టుగా పెంచుతారు. దీని వేరు వ్యవస్థ నుండి పిలకలు వస్తాయి. దీనిని సాధారణంగా భూమి కోతను నివారించడానికి, నదీ ప్రవాహాల కట్టలపై భూమిని నిలకడగా ఉంచడానికి పెంచుతారు.
దీని వాసన నిచ్చే పూలు, నీడనిచ్చే కారణంగా దీనిని రోడ్ల ప్రక్కన, తోటలలో అలంకరణ మొక్కలుగా నాటుతారు.
ఇరుగుడు చెట్టు కాయలు ఇథనాల్ ద్రావణాలు మంచి నీటి నత్త భోంఫలారియా ఫీఫరీ గుడ్లపై మొల్లస్కిసైడ్ ప్రభావాన్ని చూపుతుంది.
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

, , , , , , , , , , , , , , , , , , #అటవీవ్యవసాయం, #ఆయుర్వేదవైద్యం, #ఇండియన్‌రోజ్‌వుడ్, #ఇరుగుడు, #ఇరుగుడుచెట్టు, #ఔషధచెట్లు, #ఔషధమొక్కలు, #ఔషధవనం, #చెట్లప్రయోజనాలు, #పశుగ్రాసం, #మొక్కలఉపయోగాలు, #షిషం, #సంప్రదాయవైద్యం, agri news, Agriculture, Andhra Pradesh, natural farming, telangana, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ

** జామకాయ, మామిడికాయ, పచ్చిమిర్చి రోటి పచ్చడి ** ------------------------------------------------------------తయారుచేసే వ...
30/10/2026

** జామకాయ, మామిడికాయ, పచ్చిమిర్చి రోటి పచ్చడి **
------------------------------------------------------------
తయారుచేసే విధానం: జామకాయలని, మామిడి కాయలని, వెల్లుల్లి, పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసుకున్న పచ్చిమిర్చిని రుచికి తగినంత ఉప్పుని మామిడికాయ ముక్కలని కచ్చాపచ్చాగా రోటిలో బండతో దంచి, తదుపరి జామకాయ ముక్కలని వెల్లుల్లిని, చిటికెడు పసుపుని వేసి దంచుకోవాలి. రెండు చెంచాలు నూనె వేసి కలపాలి. ఒక గంట తర్వాత మామిడి కాయలో ఉన్న పులుపు వూరి, జామకాయ ముక్కలకి పట్టి కొంచం గ్రేవీగా వస్తుంది. అంతే! పచ్చడి రెడీ!!
ఈ పచ్చడి వేడివేడి అన్నంలోగానీ, రొట్టెలోగానీ, దోసెలోగానీ వేసుకుతింటే… రుచిగా ఉంటుంది!

కావలసిన పదార్థాలు:

జామకాయ – 1 (పావుకిలో సైజు)
మామిడికాయ – 1 (పావుకిలో సైజు))
పచ్చిమిర్చి – 30 గ్రాములు
ఉప్పు – రుచికి తగినంత
జీలకర్ర – 2 టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి రేకలు – 10
పసుపు – చిటికెడు.
ఆయిల్ – రెండు చెంచాలు
రచన: ధనలక్ష్మి కొల్లిపర, గచ్చిబౌలి హైదరాబాద్

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

, , , , , , , , , , , , #ఆంధ్రవంటలు, #ఆరోగ్యకరమైనఆహారం, #ఇంటివంటలు, #జామకాయపచ్చడి, #జామకాయరెసిపీ, #జామమామిడిపచ్చడి, #తెలుగువంటలు, #దేశీవంటలు, #పచ్చిమిర్చిపచ్చడి, #పల్లెటూరివంటలు, #మామిడికాయపచ్చడి, #మామిడికాయరెసిపీ, #రుచికరమైనపచ్చళ్ళు, #రోటిపచ్చడి, #వండనివంటలు, #సాంప్రదాయవంటలు, agri news, Agriculture, Andhra Pradesh, telangana, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ

30/10/2026

FULL VIDEO LINK👉👉👉 : https://youtu.be/2d-oydbX5mM
-----------------------------------------------------------------------
#బాదంశ్రీనివాసరెడ్డి, #కరివేపాకుసాగు, #డ్రాగన్ ఫ్రూట్ సాగు, #యువరైతు, #సహజవ్యవసాయం, #సేంద్రియవ్యవసాయం, #అంతరపంటలు, , , , , , , , ​

ప్రకారం జిల్లా దర్శి మండలం చలివేంద్రం గ్రామానికి శ్రీనివాస్ రెడ్డి.. 7 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. కరివేపాకు, దానిమ్మ, వరి, డ్రాగన్ ఫ్రూట్ వంటి పంటలు పండిస్తున్నారు. 5 ఎకరాల్లో డ్రాగన్ తోట వేశారు. అమెరికన్ బ్యూటీ, తైవాన్ పింక్, మెరాకన్ రెడ్, సియామ్ 100 రకాలు సాగు చేస్తున్నారు. పోల్ మరియు ట్రెల్లీస్ విధానంలో మొక్కలు పెంచుతున్నారు. వచ్చిన పంట దిగుబడిలో ఎక్కువ శాతం తోట వద్దే అమ్ముతూ మంచి లాభాలు ఆర్జిస్తున్నారు.

డ్రాగన్ ఫ్రూట్ సాగు, రకాలు, పోల్ - ట్రెల్లీస్ విధానం, మొక్కలు, మార్కెటింగ్ తదితర అంశాలపై మరింత సమాచారం కోసం బాదం శ్రీనివాస్ రెడ్డి గారిని 83092 82862 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు

** సేంద్రియ సేద్యం – రైతుకు నవశకం ** ---------------------------------------------ప్రస్తుత కాలంలో రైతులు, రసాయన ఎరువులు ...
29/10/2026

** సేంద్రియ సేద్యం – రైతుకు నవశకం **
---------------------------------------------
ప్రస్తుత కాలంలో రైతులు, రసాయన ఎరువులు మరియు పురుగుమందుల వాడకాన్ని తగ్గించుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. రసాయన రహిత ఉత్పత్తులకు మార్కెట్‌లో డిమాండ్ వేగంగా పెరుగుతోంది. రసాయనాలు లేకుండా సహజ సిద్ధంగా పండించిన పంటలను కొనుగోలు చేయడానికి ప్రజలు మొగ్గు చూపుతున్నారు.సేంద్రియ వ్యవసాయం అనేది కృత్రిమ రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకుండా, కేవలం ప్రకృతి సిద్ధమైన వనరులతో పంటలు పండించే ఒక సాంప్రదాయ మరియు సుస్థిర సాగు పద్ధతి. దీనిని జీవ వ్యవసాయం లేదా పర్యావరణ వ్యవసాయం అని కూడా పిలుస్తారు.

సేంద్రియ వ్యవసాయం అంటే ఏమిటి?*
కృత్రిమ రసాయనాలు, జన్యుమార్పిడి విత్తనాలు, పురుగుమందుల వాడకాన్ని పూర్తిగా తొలగించి, ప్రకృతిలో లభించే సేంద్రియ పదార్థాల సహాయంతో చేసే వ్యవసాయమే సేంద్రియ వ్యవసాయం.
ఇందులో ఆవుపేడ, గోమూత్రం, శనగపిండి, బెల్లం, చెట్ల ఆకులు మొదలైన వాటితో ఎరువులను, పురుగుమందులను తయారు చేస్తారు. ఈ విధంగా పండించిన పంటల వల్ల కేవలం ఆరోగ్యానికి మేలు జరగడమే కాకుండా, భూమి సారాన్ని కూడా కాపాడుతుంది.

ప్రధాన సాగు పద్ధతులు
పంటల మార్పిడి: ఒకే రకమైన పంటను పదే పదే వేయకుండా, పంటను మార్చడం ద్వారా భూమిలో నత్రజని శాతం పెరిగి నేల సారవంతమవుతుంది.

పచ్చిరొట్ట పైర్లు: జనుము, పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట పైర్లను సాగు చేసి అవి పూతకు రాకముందే భూమిలో కలియదున్నడం.
వర్మికంపోస్ట్: వానపాముల సహాయంతో సేంద్రియ వ్యర్థాలను నాణ్యమైన ఎరువుగా మార్చి పొలానికి అందించడం.
జీవామృతం: ఇది నేల సారాన్ని పెంచడానికి మరియు పంటలకు అవసరమైన సూక్ష్మజీవులను అందించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇది తయారు చేయడానికి ఒక పెద్ద ప్లాస్టిక్ డ్రమ్ములో 200 లీటర్లు నీటికి, 10 కిలోల ఆవుపేడ, 10 లీటర్ల గోమూత్రాన్ని వేసి బాగా కలపాలి. తరువాత 2 కిలోల బెల్లం, 2 కిలోల పప్పు దినుసుల పిండిని, పుట్టమట్టి లేదా గట్టు మట్టిని ఒక గుప్పెడు నీటిలో వేర్వేరుగా గడ్డలు రాకుండా కలుపుకొని గోనె సంచి లేదా కాటన్ గుడ్డను కప్పాలి. తయారైన రోజు నుండి 10 నుండి 12 రోజుల లోపు దీనిని సాగు నీటితో కలిపి గాని, లేదా వడకట్టి పంటలపై నేరుగా పిచికారి చేయడానికి ఉపయోగించవచ్చు.
సహజ తెగుళ్ల నివారణః వేప కషాయం, బ్రహ్మాస్త్రం వంటి సహజ కషాయాలను వాడి చీడపీడలను అరికడతారు.

కలిగే ప్రయోజనాలు
రసాయన సాగు నుండి సేంద్రియ సాగుకు మారిన మొదటి రెండు, మూడేళ్లు దిగుబడి కొంత తగ్గే అవకాశం ఉంది. మార్కెట్‌లో ఆర్గానిక్ ఉత్పత్తులకు మంచి ధర లభించాలంటే ఖచ్చితమైన ఆర్గానిక్ సర్టిఫికేషన్ పొందడం రైతులకు కొంత ఖర్చుతో, ప్రక్రియతో కూడుకున్న పని. పండించిన పంటను సరైన ప్రీమియం ధరకు అమ్ముకోవడానికి కోల్డ్ స్టోరేజ్, రవాణా సౌకర్యాలు తక్కువగా ఉన్నాయి. పేడ, బయో-ఫర్టిలైజర్స్ వంటి సహజ ఎరువుల తయారీకి, కలుపు తీయడానికి ఎక్కువ మందే కూలీలు అవసరమవుతారు.

ముగింపు:
మొదట్లో దిగుబడి కొంత తక్కువగా ఉన్నప్పటికీ, రెండు లేదా మూడు పంటల తర్వాత స్థిరమైన మరియు మెరుగైన దిగుబడులను సాధించవచ్చు. నేటి తరానికి విషరహిత ఆహారాన్ని అందించాలన్నా, రేపటి తరానికి జీవమున్న భూమిని వారసత్వంగా ఇవ్వాలన్నా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ఎంతైనా అవసరం.

డా. వై. చైతన్య, పిహెచ్.డి. స్కాలర్, హైదరాబాద్, ఫోన్: 9949804951

, , , , , , , , , , , , #జీవవ్యవసాయం, #జీవామృతం, #పచ్చిరొట్టపైర్లు, #పంటలమార్పిడి, #పర్యావరణహితవ్యవసాయం, #రసాయనరహితవ్యవసాయం, #రైతునేస్తం, #రైతులు, #రైతుసంక్షేమం, #వర్మికంపోస్ట్, #విషరహితఆహారం, #వేపకషాయం, #సహజవ్యవసాయం, #సహజసేద్యం, #సుస్థిరవ్యవసాయం, #సేంద్రియఎరువులు, #సేంద్రియవ్యవసాయం, #సేంద్రియసాగు, agri news, Agriculture, Andhra Pradesh, natural farming, telangana, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ

** లేగ దూడకు బొడ్డు వాపు / బొడ్డు కంతి / బొడ్డు పుండు ** ---------------------------------------------------------------...
29/10/2026

** లేగ దూడకు బొడ్డు వాపు / బొడ్డు కంతి / బొడ్డు పుండు **
----------------------------------------------------------------
ఈ జబ్బు సాధారణంగా నెల లోపు వయస్సున్న దూడలకు వస్తుంది. బొడ్డు దగ్గర గట్టి వాపు, నొప్పి, చీము కారటం, జ్వరం, కీళ్ళనొప్పులు, కీళ్ళవాపులు వుంటాయి. పాలు త్రాగలేకపోతుంది.

కారణాలు : బొడ్డుకు మట్టి అంటుకోవడం, సూక్ష్మజీవులు ఆశించడం, అపరిశుభ్రమైన పరిసరాలు, దూడ బొడ్డును తల్లి నాకటం
హెర్నియాకు భేదాత్మక పరిశీలన చెయ్యాలి.

పరిష్కారాలు:
ఆయుర్వేదం: క్రింది వాటిలో ఏదైనా ఒక విధానం.

గృహవైద్యం:

బొడ్డుకు పసుపు రాయాలి.
ఉల్లిపాయలు నూనెలో ఉడికించి, వాపుపైపెట్టి కట్టు కట్టాలి.
వన తులసి గింజలు నూరి, వాపుపై పెట్టి కట్టు కట్టాలి.
పొగాకు రసం 10 గ్రా॥, నువ్వుల నూనె 100 గ్రా॥ కలిపి, కాచి, చల్లార్చి వాపుపై పూత పెట్టాలి.
వెల్లుల్లిపాయను నలగగొట్టి వాపుపై పెట్టి కట్టు కట్టాలి.
పెరటి వైద్యం:
మర్కొండాకు, వేపాకు, వావిలాకు, గాడిద గడపాకు ఒక్కొక్కటి గుప్పెడు, కలబంద గుజ్జు 20 గ్రా॥, పసుపు 20 గ్రా॥ నీటి సున్నంలో కలిపి బొడ్డుపై పట్టు వేయాలి.

మూలికావైద్యం:

బాలింతబోలు 50 గ్రా॥, ముసాంబరం 20 గ్రా॥, తగినంత నిమ్మకాయ రసంతో వెచ్చ చేసి వాపుపై రాయాలి.
మహిసాక్షి 50 గ్రా॥, మెంతులు 50 గ్రా॥, మానుప్పు 20 గ్రా॥ నూరి బొడ్డు వాపుపై రాయాలి.
హోమియో:

కాలెండులా Q/ ఎకినేషియా Q 10 చుక్కలు గాని, ఫెర్రం ఫాస్ చూర్ణం గానీ 50 మి.లీ. కొబ్బరి నూనెలో కలిపి వాపుపై రాయాలి.
కాల్కేరియా ఫ్లోర్ 30 మందు 5 బిళ్ళలు ఉదయం, సాయంత్రం 10 రోజులు తినిపించాలి.
పై పూతతో పాటు సైలీషియా 200 మందు మాత్రలు రోజుకు 10 చొ॥న తినిపించాలి.
జ్వరం వుంటే, పైరోజెన్ 30 గానీ, ఎకోనైటం 30 గానీ ఆర్సెనికం ఆల్బం 30 గానీ, బెల్లడోన 30 గానీ 10 మాత్రలు రోజుకు 1 పర్యాయం చొ॥న తినిపించాలి.
పుండు వాసనరాకుండా, మెర్క్‌సాల్ 200 ఉదయం, సాయంత్రం 5 మాత్రలు చొ॥న తినిపించాలి.
బొడ్డుకు చీము వుంటే హెపార్ సల్ఫ్ 30 మందు 5 బిళ్ళలు రోజుకు 2 సార్లు తినిపించాలి.
గాయం మాననప్పుడు మైరిస్టిక సెబిఫెర 30 మందు 5 మాత్రలు రోజుకు 2 సార్లు తినిపించాలి.
హోమియో వ్యాధి నిరోధక టీకా :- స్ట్రెప్టోకోకినం 30 / ఈ. కొలై నోసోడ్ 30 దూడ పుట్టిన వెంటనే మొదటి మోతాదు, అప్పటి నుండి 24 గంటలకు 2వ మోతాదు, 48 గంటలకు 3 వ మోతాదు, 72 గంటలకు 4వ మోతాదు చొప్పున తినిపించాలి.
అల్లోపతి:

ముందుగా బొడ్డు కంతిపై వున్న వెంట్రుకలను తీసివేయాలి.
వాపు పక్వానికి వచ్చే వరకు, అయోడిన్ ఆయింటుమెంటు రాచి, కాపడం పెట్టాలి.
పక్వానికి వచ్చిన తరువాత దానంతట అదే పగిలి, చీము బయటకు రాకుండా వుంటే, పశువైద్యుని సంప్రదించితే వారు గాటు పెట్టి చీము పిండి, పొటాషియం పర్మాంగనేట్ లోషన్‌తో శుభ్రపరుస్తారు.
అయోడిన్ (IODENE) తో తడిపిన గుడ్డను వత్తిగా ఎక్కించాలి.
డైక్రిస్టిసిన్ ఎస్ (DICRYSTICIN S) వంటి ఇంజక్షను, మడు రోజులు కండకు (I/Mగా) చేయించాలి.
ఆక్సికామ్ వెట్ (OXYCAM VET) లేదా మెలోనెక్స్ ప్లస్ (MELONEX PLUS) వంటి ఇంజక్షను, 3 మి.లీ మడు రోజులు కండకు (I/M) చేయించాలి.
జాగ్రత్తలు:

బొడ్డు రోజు రోజుకూ ఎండి పోతూ క్రమేణా రాలిపోతుంది.
ఈనటానికి, దూడను బయటికి రప్పించటానికి సహాయ పడేవారు, శుభ్రంగా సబ్బుతో చేతులు కడుక్కొని ఆ పనికి పూనుకోవాలి.
బొడ్డు ఊడిపోయేదాకా బొడ్డును కాకులు లాగకుండా, తల్లి నాకకుండా, బొడ్డుకు మట్టి అంటకుండా బొడ్డుకు కట్టు కట్టాలి.
గాయంపై ఈగలు వాలకుండా వేపనూనె రాయాలి.
రైతునేస్తం ప్రచురణ ‘గో-సంజీవని’ పుస్తకం కొరకు సంప్రదించండి: 96 76 79 77 77కు సంప్రదించండి.

, , , , , , , , , , , , , , , , , #ఆవులఆరోగ్యం, #గోఆధారితవ్యవసాయం, #గోసంజీవని, #గోసంరక్షణ, #దూడలవ్యాధులు, #దూడలసంరక్షణ, #పశుపోషణ, #పశువైద్యం, #పశుసంరక్షణ, #బొడ్డుకంతి, #బొడ్డుపుండు, #బొడ్డువాపు, #రైతునేస్తం, #లేగదూడ, #లేగదూడఆరోగ్యం, agri news, Agriculture, Andhra Pradesh, natural farming, telangana, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ

29/10/2026

FULL VIDEO LINK 👉👉👉 : https://youtu.be/dUlIGfbIfZE
---------------------------------------------------------------------
#కొబ్బరిసాగు, #అంతరపంటలు, #కోకోసాగు, #వక్కసాగు, #మిరియాలసాగు, #జాజికాయసాగు, #సేంద్రియవ్యవసాయం, #ప్రకృతివ్యవసాయం, #జీవామృతం, #డ్రిప్ఇరిగేషన్, , , , , , , , , , ​

తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలానికి చెందిన సతీశ్.. 6 ఎకరాల్లో ఐదు అంచెల వ్యవసాయ విధానంలో వివిధ రకాల పంటలు పండిస్తున్నారు. కోకో, కొబ్బరి, పైనాప్పిల్, వక్క, జాజికాయ, మిరియాలు సాగు చేస్తున్నారు. జీవామృతం యూనిట్ ఏర్పాటు చేసి పంటలు పారిస్తున్నారు. కోసిన పంటలను సోలార్ షెడ్డు లో ఆరబెట్టి విక్రయిస్తున్నారు.

5 లేయర్ సాగు విధానం, పంటల యాజమాన్యం, మార్కెటింగ్ తదితర అంశాలపై మరింత సమాచారం కోసం సతీశ్ గారిని 90107 42459 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు.

** ఔషధ మొక్క… గాజరగడ్డ ** --------------------------------గాజరగడ్డ ఒక హెర్బల్ మొక్క. ఇది 30-60 సెం.మీ. ఎత్తు పెరుగుతుంది...
29/10/2026

** ఔషధ మొక్క… గాజరగడ్డ **
--------------------------------
గాజరగడ్డ ఒక హెర్బల్ మొక్క. ఇది 30-60 సెం.మీ. ఎత్తు పెరుగుతుంది. గరుకు నూగు కలిగి బిగుతైన కాండం కలిగి ఉంటుంది. ఆకులు 3 చిన్న ఆకులు కలిగి ఉంటాయి. ముక్కోణాకారంలో ఉంటాయి. పూలు చిన్నవిగా, పాలిపోయిన తెలుపు రంగులో గుత్తులలో ఉంటాయి. పూలగుత్తి 3-4 అం. వెడల్పు కలిగి ఉంటుంది. మొగ్గ పింకు రంగులో, పూలు ఎరుపు లేదా ఊదా రంగులో ఉంటాయి. కాయలు గుడ్డు ఆకారంలో చదునుగా ఉంటాయి. కాయ చిన్నదిగా రక్షక నూగుతో కప్పబడి ఎండిపోయి ఉంటుంది. వన్యక్యారెట్ రోడ్డు ప్రక్కన, సాగు చేయని భూముల్లో ఉంటుంది.

సాధారణ నామం : వన్యక్యారెట్ శాస్త్రీయ నామం : డాకస్ కరోట కుటుంబం: ఎపియేసి

ఉపయోగాలు : ఔషధ రంగంలో …

గాజరగడ్డని ఆహారంగా, ఔషధంగా ఉపయోగించవచ్చు. గాజరగడ్డని ఉడికించి లేదా తాజాగా తినవచ్చు. పూల గుత్తులను ఫ్రెంచిఫ్రైస్ తయారీలో ఉపయోగించవచ్చు. వాసన కలిగిన గింజలను సూపులు, స్ట్రూల తయారీలో ఉపయోగించవచ్చు.
శతాబ్దాల తరబడి దీనిని ప్రత్యామ్నాయ ఔషధంగా ఉపయోగిస్తున్నారు. దీనిలో ఎసిటోన్, ఎసిటైల్‌కోలిన్, ఆల్ఫాలినోలెనిక్ యాసిడ్, ఆల్ఫాపైసెన్, ఆల్పాటోకోఫెరాల్, ఎపిజెనిన్, అరాకిడోనిక్ యాసిడ్, ఆర్ౙినైన్, అసరోన్, యాస్కార్బిక్ యాసిడ్, బెర్లాప్టెన్, బీటాకెరోటిన్, బీటాసైటోస్టిరాల్, కెఫీక్‌యాసిడ్, క్యామ్‌ఫిర్, క్లోరోజెనిక్ యాసిడ్, క్లోరోఫిల్, క్రైసిన్, సిట్రాల్, సిట్రిక్ యాసిడ్, కౌమారిన్, ఎలెమిసిన్, ఎస్క్యులెటిన్, ఇథీనాల్, యూజెనాల్, ఫాల్కరినాల్, ఫెరూలిక్ యాసిడ్, ఫోలాసిన్, ఫార్మిక్ యాసిడ్, ఫ్రక్టోస్, గామాలినోలెనిక్ యాసిడ్, జిరానియాల్, గ్లూటామిన్, గ్లెåసిన్, హైడ్రోజన్ సయనైడ్, మిస్టిడిన్, కీంప్‌ఫెరాల్, లెసిథిన్, లియోనెన్, లినోలిక్ యాసిడ్, లిథియం, లూపియాల్, లూటిన్, లూటెయోరిన్, లైకోపెన్, మెగ్నీషియం, మాంగనీస్, మిథియోనైన్, మ్యూఫా, మైర్సెన్, మైరిసెటిన్, మిరిస్టిసిన్, నియాసిన్, ఓలిక్‌యాసిడ్, పాంటోథనిక్ యాసిడ్, పెక్టిన్, ఫినైల్ అలనైన్, పొటాషియం, సొరాలెన్, క్వెర్సెటిన్, స్కోపోలెటిన్, స్టిగ్మాస్టెరాల్, సుక్రోస్, థయామిన్, ట్రిప్టోఫాన్, ట్రైరోసిన్, అంబెల్లిఫెరోన్, క్ౙాంతోటాక్సిన్, అనేక విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవన్నీ ఈ క్రింది చర్యలను కలిగి ఉంటాయి. అనాల్ౙెసిక్, యాంటిఆర్థ్రెåటిక్, యాంటిడిప్రెసెంట్, యాంటిసైకోటిక్, యాంటిస్కైజోఫ్రినిక్, యాంటిడోట్, యాంటిఇన్‌ఫ్లమేటరి, యాంటీబాక్టీరియల్, యాంటికన్వల్సెంట్, యాంటిడయాబెటిక్, యాంటిఈస్ట్రోజెనిక్, యాంటిఫ్లూ, యాంటిహిస్టామినిన్, యాంటి ఆక్సిడెంట్, యాంటిసెప్టిక్, యాంటి స్పాస్మోడిక్, యాంటిఎపిలెప్టిక్, యాంటియాంక్ౙె åటి, యాంటిస్ట్రెస్, యాంటిహ్యాంగఓవర్, యాంటివైరల్, క్యాన్సర్‌ప్రివెంటివ్, ఎక్స్‌పెక్టొరెంట్, ఫంగిస్టాట్, ఇమ్యునోస్టిమ్యులెంట్, సెడెటిన్, ట్రాంక్విలైజర్, ఎఫ్రోడిసియాక్, స్వీటెనర్, పిట్యుటరిస్టిమ్యులెంట్.
ఇది అతి విలువైన మొక్క. అల్ౙీమర్స్, పార్కిన్‌సన్‌వ్యాధి, క్రోన్స్‌వ్యాధి, ఇన్‌ఫెర్టిలిటి, ఆస్త్మాప్రివెంటివ్, అనేక రకాల క్యాన్సర్, డయాబెటిస్, ల్యుకేమియా, ఎయిడ్స్, స్పైనాబిఫిడ, మైగ్రెయిన్‌హెడఏక్, ఒబేసిటి, సాధారణ జలుబు వ్యాధుల నివారణకుపయోగపడుతుంది.
వ్యవసాయరంగంలో

క్యారట్ ద్రావణం (1 మి.లీ.) ట్రైబోలియం కాస్టానియంపై అత్యుత్తమ కీటకనాశక చర్యను ప్రదర్శించింది. క్యారట్ ద్రావణం (1మి.లీ.) { లెవిస్టికం అఫిసినేల్ (2 మి.లీ.) ద్రావణం అత్యంత సమర్ధవంతంగా ట్రైబోలియం కాస్టానియంని అరికట్టాయి. (హ్రుడోవ, అతని అనుచరులు, 2006)
క్యారట్ గింజల నుండి వేరుచేసిన ఎసెన్షియల్ ఆయిల్ ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్‌పై యాంటి ఫంగల్ చర్యను ప్రదర్శించింది. (దివేరి, డుబె, 1995). క్యారట్ వేర్ల నుండి తీసిన ఎసెన్షియల్ ఆయిల్ అఫ్లాటాక్సిన్ ఉత్పత్తిని నివారించింది. (జస్సికామిసియాన్, అతని అనుచరులు, 2004; బెండియాడెల్లా, అతని అనుచరులు, 2014). క్యారట్ ఆయిల్‌లోని కెరటాల్ ఆల్టర్నేరియా ఆల్టర్నేట శిలీంద్ర పెరుగుదల నరికట్టింది (జాస్సికా మిసియాన్, అతని అనుచరులు, 2004).
క్యారట్ గింజల నూనె ఆస్పర్ౙిల్లస్ పారసైటికస్ పెరుగుదలనరికట్టి అఫ్లాటాక్సిన్ ఉత్పత్తవకుండా చేసింది (భట్, అతని అనుచరులు, 1983).
క్యారట్ గింజల నుండి వేరు చేసిన రెండు పెప్టెåడ్లు వర్టిసిల్లియం డాలియే పెరుగుదలను సమర్ధవంతంగా అరికట్టాయి (ఇల్లి, అతని అనుచరులు, 2006).
క్యారట్ పూల నుండి వేరు చేసిన ఎసెన్షియల్ ఆయిల్ స్పోడోప్టెరా లిట్టోరాలిన్ 3వ దశ లార్వాలపై ఫ్యూమిగెంట్ చర్యను ప్రదర్శించింది (సలాహెడ్ౙిన్, అతని అనుచరులు, 2013).
క్యారట్ ఎసెన్షియల్ ఆయిల్ క్యూలెక్స్ పిపియెన్‌స్పాల్లెన్స్, డి. మాగ్న దోమలపై లార్విసైడల్ ప్రభావాన్ని చూపింది (పార్క్, పార్క్, 2012).
క్యారట్ పూల నుండి వేరు చేసిన ఆవిరయ్యే నూనె స్పోడోప్టెరా లిట్టొరాలిస్ 3వ దశ లార్వాలపై విషప్రభావాన్ని చూపింది. (సౌగ్విర్, అతని అనుచరులు, 2013).
క్యారట్ ఆయిల్ బాసిల్లస్ సబ్‌టైలస్, సాల్మొనెల్లా టైఫిన్యూరియం బాక్టీరియా పెరుగుదలనరికట్టింది (గ్రోవర్, రావు, 1976, 1978, 1979).
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

, , , , , , , , , , , , , , , , , , , , , , , , , #ఔషధమొక్కలఉపయోగాలు, #ఔషధమొక్కలు, #ఔషధవేదం, #గాజరగడ్డ, #గాజరగడ్డఉపయోగాలు, #వన్యక్యారెట్, agri news, Agriculture, Andhra Pradesh, natural farming, telangana, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ

ఈరోజు ఉదయం పొలంలో...
29/10/2026

ఈరోజు ఉదయం పొలంలో...

** ఔషధ మొక్క… కామాక్షి / మదన ** ---------------------------------------------కామాక్షి చెట్టు మొదలు లావుగా ఉండి మందమైన కా...
27/10/2026

** ఔషధ మొక్క… కామాక్షి / మదన **
---------------------------------------------
కామాక్షి చెట్టు మొదలు లావుగా ఉండి మందమైన కార్క్ వంటి బెరడుతో కప్పబడి ఉంటుంది. చెట్టు చివరన పొడవాటి, ప్రకాశవంతమైన ఆకుపచ్చ రంగు, మెరిసే ఆకులు ఏర్పడతాయి. ప్రతి ఆకు 150 నుండి 170 సెం.మీ. పొడవుండి 54 నుండి 110 చిన్న ఆకులు కలిగి ఉంటుంది.. మగ కామాక్షి మొక్కలు పసుపుగోధుమ రంగు అండాకారపు కోన్స్ కలిగి ఉంటాయి. ఇవి 24-48 సెం.మీ. పొడవు, 12-18 సెం.మీ. వ్యాసం కలిగి ఉంటాయి. ఆడ మొక్కలో కోన్స్ ఏర్పడవు. అవి పొడవాటి, ఆకువంటి స్పోరోఫిల్స్‌పై గింజలు కలిగి ఉంటాయి. అవి కురచగా, వత్తుగా ఉన్న నారింజ రంగు నూగు కలిగి 20-35 సెం.మీ. పొడవుంటాయి. కామాక్షి గింజలు చిన్నవిగా 3-9 మి.మీ. పొడవుండి లేత ఎరుపుపసుపు రంగు గుజ్జుతో కప్పబడి ఉంటాయి. చెట్టు 3-5 మీ. ఎత్తు పెరుగుతుంది.

సాధారణ నామం : సాగోపామ్ శాస్త్రీయ నామం : సైకాస్ సిర్సినాలిస్ కుటుంబం: సైకడేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

పుప్పొడి నార్కోటిక్, కామాక్షి మొక్క బెరడు, గింజలను నూరి నూనెతో కలిపి పేస్టు చేసి గాయాలు, వాపులపై పట్టీగా వేస్తారు.
లేత ఆకుల రసాన్ని వాంతుల చికిత్సలో ఉపయోగిస్తారు. ఈ మొక్క పిత్ నుండి సగ్గుబియ్యం తయారు చేస్తారు. ఆకుల కషాయాన్ని దగ్గు నివారణకు త్రాగుతారు.
వ్యవసాయరంగంలో

సంప్రదాయ వ్యవసాయంలో కామాక్షి పూలను పురుగుల యాజమాన్యంలో ఉపయోగిస్తారు. దీని మగపూలు కుళ్ళినపుడు ఒక ఘాటైన వాసనని విడుదల చేస్తాయి (మమన్నన్ & నటరాజన్, 2010).
కామాక్షి మగచెట్టు, పూవులను కోసి వరి పంట స్థాయి కన్నా ఎక్కువ ఎత్తు ఉన్న కర్రలకు కట్టాలి.
ఈ కర్రలను గడ్డితో చుట్టి పూలను కట్టి వరి పొలంలో 10-15 చోట్ల పాతాలి. వీటి వాసనకు కంకినల్లి పెద్ద పురుగులు వికర్షింపబడి 2 వారాల పాటు పొలంలోకి ప్రవేశించలేవు. ఈ సమయానికి పాలుపోసుకునే దశ పూర్తయి, పంట పరిపక్వ దశకు చేరుకుంటుంది.
కామాక్షి పూలలో ఉన్న సైకాస్టిన్ అనే రసాయనం కీటకనాశక మరియు నిరోధక లక్షణాలు కలిగి ఉంది. శ్రీలంక వరి రైతులు ‘కెమ్ కామ’ పద్ధతులు అనే పురుగు యాజమాన్య పద్ధతులను మొక్క ఆధారిత పదార్థాలు మరియు సాగు పద్ధతులనుపయోగించి వృద్ది చేశారు. మొక్కలలోని రసాయన పదార్థాలను గురించి అవగాహన లేనప్పటికీ శ్రీలంక వరి రైతులు ఈ విజయవంతమైన సస్యరక్షణ పద్ధతిని వృద్ధి చేయడానికి కొన్ని దేశీయ మొక్కలను గుర్తించారు. ఈ కెమ్ పద్ధతులు పురుగు మందు ప్రభావం, జిగట ఎరలు, దీపపు ఎరలు వంటి వివిధ రకాల చర్యలను కలిగి ఉంటాయి. ఆధునిక విజ్ఞానం వృద్ధి చెందడంతో, కెమ్ పద్ధతిలో దాగి ఉన్న రహస్యాలను ఏ మొక్క ఆధారిత రసాయనం ఏ పురుగుకి సరైన ఎంపిక అనే విషయాన్ని పరిశోధించవచ్చు. వరి పొలాల దగ్గర కదురు (సెర్బెరమ్‌గడ్డి) కర్రలను మంట పెట్టడం వల్ల దీపపు ఎరతో పాటు రసాయన వికర్షకాన్ని కూడా పురుగుల నివారణకు ఉపయోగించినట్లు పరిగణనలోకి తీసుకోవచ్చు. ఇది ఒక ‘కెమ్ కామ’ పద్ధతి. కామాక్షి పూలలో సైకాసిన్ ఒక ముఖ్య రసాయనం. దీనికి కీటకనాశక మరియు కీటక నిరోధక లక్షణాలున్నాయి. దీని ద్వారా ఆధునిక శాస్త్రీయ పరిశోధనలు పురాతన కెమ్ పద్ధతిలో పోలి వున్నాయని విశదమయింది. ఇటువంటి చర్యలు గల అనేక మొక్క జాతులున్నాయి. జిల్లేడు, మీలియా, క్రోటాన్ లాసిఫర్, యూఫర్బియా యాంటిక్సోరం సంప్రదాయ పద్ధతులతో సరితూగుతున్నాయి. ఇవి పర్యావరణహిత పద్ధతులు.
సంప్రదాయ ‘కెమ’ పద్ధతులు
మొక్క: క్రోటాన్ లాసిఫెర
నివారించబడే పురుగు: వరి కంకినల్లి
పనిచేసే విధానం: మొక్కల కట్టను వరి పొలంలో మొక్కలపై లాగుతూ పోతే వికర్షక చర్యవల్ల నివారించడతాయి.

మొక్క: కదురు
నివారించబడే పురుగు: వరి కంకినల్లి
పనిచేసే విధానం: వరి పొలాల దగ్గర మంటలు వేయడం ద్వారా దీపపు ఎరలా పురుగులను ఆకర్షిస్తుంది.

మొక్క: కామాక్షి
నివారించబడే పురుగు: వరి కంకినల్లి
పనిచేసే విధానం: కామాక్షి మగపూవు కుళ్ళేటపుడు ఘాటైన వాసన విడుదల చేస్తుంది. ఈ మగపూవుని ఉదయం వేళలో కత్తిరించి ఈ భాగాలను కర్రలకు కట్టి వివిధ ప్రాంతాలలో పాతాలి. మరుసటి రోజు ఈ పూల భాగాలపై నీరు చల్లాలి.

మొక్క: మీలియా
నివారించబడే పురుగు: వివిధ పురుగులు
పనిచేసే విధానం: ఘాటైన వాసన గల మీలియా ద్రావణాన్ని తాటాకులపై చల్లి వరి పొలంలో వివిధ ప్రదేశాలలో ఉంచుతారు. ఈ ద్రావణంలోని ఆల్కలాయిడ్లు, ఫ్లేవనాయిడ్స్, టానిన్స్, టెర్పెనిన్స్, ఎసెన్షియల్ ఆయిల్స్ పురుగులను తినకుండా, గుడ్లు పెట్టకుండా నిరోదిస్తాయి.

మొక్క: జిగట ఎరలు
నివారించబడే పురుగు: రసంపీల్చే పురుగులు
పనిచేసే విధానం: ఇతర పురుగులు విసనకర్ర, కర్ర లేదా తాడుకి జిగురు పూసి (జిల్లేడు, పాలపొద పాలు) పంటపై కదిలిస్తే పురుగులు జిగురుకు అంటుకుంటాయి.

మొక్క: దీపపు ఎరలు
నివారించబడే పురుగు: ఎగిరే పురుగులు
పనిచేసే విధానం: మధుకా లాంగిఫోలియా, వేప, కనారం జీవానికం నూనె ద్రావణాలతో దీపాలను వెలిగించి పెడితే ఆకర్షింపబడిన పురుగులను నాశనం చేయాలి.
(విడనపతిరాన అండ్ దస్సనాయకె, 2013).

కామాక్షి ఓవ్యూలఎండోటెస్టా మిథనాల్ ద్రావణం బాసిల్లస్ సెరియస్, స్టఫైలోకోకస్ ఆరియస్, ఎస్కరిచియా కోలి, క్ౙాంతోమోనాస్ కాంపెస్ట్రిస్ మాల్వేసియారం లపై వాంకోమైసిన్, పెనిసిలిన్, బాక్టీరిమైసిన్ (యాంటిబయాటిక్స్) కన్నా గణనీయంగా అధిక యాంటీబాక్టీరియల్ చర్యను ప్రదర్శించింది (కల్పశ్రీ అండ్ దవీష, 2013).
వరిలో కాండం తొలుచు పురుగు ఆశించడం గమనించగానే కామాక్షి పూలను నలగ్గొట్టి పొలంలో నిల్వ ఉన్న నీటిలో కలపాలి (విమలకీర్తి, 2002), అమువిత గమ 2002).
కామాక్షి, వేప, నిమ్మగడ్డి, పొగాకు ఆకులను నీటిలో వేసి మరగించి కొంత సమయం నానబెట్టాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని వడపోసి 2-4 రోజులు నిల్వ ఉంచాలి. తర్వాత కూరగాయల పంటపై పిచికారి చేస్తే ఈ ద్రావణం ఆకుతొలిచే పురుగు, దీపపు పురుగులు, ఆకుగూడు పురుగు, కొమ్మునల్లి, వీవిల్స్, లార్వాలు, చిత్తపురుగులను వికర్షిస్తుంది (ఒకులోన్‌లోల అండ్ అకిన్‌రిన్నోల, 2013).
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

, , , , , #ఔషధమొక్కలు, #ఔషధవేదం, #కంకినల్లి, #కామాక్షిమొక్క, #మదనమొక్క, #రైతునేస్తం, #వరిసాగు, #సంప్రదాయవ్యవసాయం, #సహజవ్యవసాయం, #సహజసస్యరక్షణ, #సాగోపామ్, agri news, Agriculture, Andhra Pradesh, natural farming, telangana, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ

27/10/2026

దేశీ ఆవుపాలతో పన్నీర్ తయారీ ఎలా? | ఇంట్లోనే సులభంగా చేసుకునే విధానం
-----------------------------------------------------------------------------
#దేశీఆవుపాలు, #పన్నీర్, #పన్నీర్‌తయారీ, #ఇంట్లోపన్నీర్, #దేశీపన్నీర్, #ఆరోగ్యకరమైనఆహారం, #ఇంటివంటలు, , , , , , , , ​

రైతునేస్తం ప్రచురణ 'వండని వంటలు' పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Address

6-2-959, Dakshin Bharat Hinid Prachara Sabha Complex, Khairtabad, Hyderabad
Telangana
500004

Alerts

Be the first to know and let us send you an email when RaituNestham posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to RaituNestham:

Shortcuts

Share

Nearby gyms & sports facilities